Breaking News

MINISTER

మత్స్యకారులను ఆదుకుంటాం

మత్స్యకారులను ఆదుకుంటాం

సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్​ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్​ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్​యార్డు, వైకుంఠధామాలను […]

Read More
ఖమ్మంలో సిమ్యులేటర్​ ప్రారంభం

రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు

సారథి న్యూస్​, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్​ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్​ సిమ్యులేటర్​ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా

మంత్రి మల్లారెడ్డికి కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా భారిన పడ్డ రాజకీయనాయకులు, సెలబ్రిటీల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో మ‌ల్లారెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మ‌ల్లారెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌నకు స‌న్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. గతంలో హోంమంత్రి మహమూద్​ అలీ, జీహెచ్​ఎంసీ మేయర్​ […]

Read More
తెలంగాణలో రైతే రాజు

తెలంగాణలో రైతేరాజు

సారథి న్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం నగరం ఏడో డివిజన్​ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ […]

Read More
మంత్రిని బలితీసుకున్న కరోనా

కరోనాతో మంత్రి మృతి

లక్నో: కరోనా మహమ్మారి సామాన్యులను, ప్రముఖులను సైతం బలితీసుకుంటున్నది. ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనాతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]

Read More
రైతులు ఏకం కావాలి

రైతులు ఏకం కావాలి

సారథి న్యూస్​, మానవపాడు: జనాభాలో 60 శాతం ఉన్న రైతులు, రైతు అనుబంధ రంగాలను ఒక్క తాటిపైకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని చెప్పారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే వ్యవసాయ ఆధారిత దేశాలని.. అందులో మనదేశం ఒకటని […]

Read More
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కంచిరావుపల్లికి మంత్రి గుడ్ ​న్యూస్​

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి గుడ్​న్యూస్​ చెప్పారు. ఆ గ్రామంలో 50 మంది నిరుపేదలకు త్వరలోనే డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టించి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆగస్టు 1న గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్​ సుజాత తేజవర్ధన్​, ఎంపీటీసీ, రైతు సమన్వయసమితి నాయకులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు, గ్రామప్రజలు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు […]

Read More
మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ మంత్రి తుల్సీ సిలావత్​, అతడి భార్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్​ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్​లోని పలువురు అధికారులు, పోలీస్​ సిబ్బందికి కూడా […]

Read More