సారథి, సిద్దిపేట ప్రతినిధి: మాస్కులు లేకుండా బయటకు రావొద్దని సర్పంచి తొడేటి రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో పలు వార్డుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించి మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. బస్టాండ్, మండల, జిల్లా కేంద్రాల్లోని షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకుండదన్నారు. కరోనా మాకు రాదంటూ అభద్రత భావంతో […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.
ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]
సారథిన్యూస్, ఖమ్మం: వలస గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలం రేగల్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుప్రాంతాల్లోని గిరిజనులు పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపించాయి. కానీ వారి బాగోగులు పట్టించుకోలేదు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలి. తక్షణసాయం కింద వారికి కొంత ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి […]
సారథి న్యూస్, చొప్పదండి: కరోనా నేపథ్యంలో లయన్స్‌క్లబ్ విశేషసేవలందిస్తున్నది. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గకేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు, సిబ్బందికి మాస్కులు పంపిణీచేశారు. కరోనాను రూపుమాపేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తొడుపునూరి లక్ష్మయ్య, ఒల్లల కృష్ణాహరి, వైస్ ప్రెసిడెంట్ కొల్లూరి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.