ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే చిత్రంలో యంగ్ హీరో మంచు మనోజ్ విలన్‌గా నటించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ భారీ హిట్‌ను అందుకున్నది. ఇప్పుడు రెండో సినిమా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కరోనా మహమ్మారితో మరణించిన టీవీ రిపోర్టర్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం పరామర్శించారు. మనోజ్ సతీమణి అర్చన, తండ్రి శ్రావణ్‌కు రూ.లక్ష చెక్కును రాష్ట్ర కురుమ సంఘం తరఫున అందజేశారు. ఆయన వెంట బండారు నారాయణ కురుమ, తమగోండ రాజేశ్వర్ కురుమ, కొలుపుల నరసింహ కురుమ, కాలె అమర్ నాథ్ కురుమ ఉన్నారు.
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా బారినపడి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మనోజ్‌కుమార్ మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వట్టికొండ రవి, లక్ష్మణ్ నరసింహారావు, రాజేష్, మోటమర్రి రామకృష్ణ, మహమ్మద్ షఫీ, ప్రభాకర్ రెడ్డి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కరోనా వ్యాధితో మృతిచెందిన జర్నలిస్ట్ మనోజ్‌కుమార్ కు జర్నలిస్టులు, పలువురు రాజకీయ పార్టీల నేతలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ […]
సారథి న్యూస్, నిజామాబాద్: కరోనా మహమ్మారితో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.50వేల ఆర్థిక సాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు( డీసీసీబీ)అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలకు వార్తలను అందిస్తూ సమాజానికి మేలు చేస్తున్న యువ రిపోర్టర్ అకాల మరణం కలచివేసిందన్నారు. మనోజ్ కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.