సారథి న్యూస్, మిడ్జిల్: సాధారణంగా అన్ని గ్రామాల మాదిరిగానే ఆ ఊరులోనూ ఎక్కువగా వలస వెళ్లి బతికే కూలీలు, కార్మికులు ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఏ ఇల్లూ చూసినా ఇంటిల్లిపాదితో కళకళలాడుతోంది. ఆ గ్రామంలో ఏ పండుగనైనా కలిసిమెలిసే జరుపుకుంటారు. అయితే గ్రామస్తులంతా పెద్దఎత్తున జరుపుకునే వేడుకల్లో పీర్ల పండగ ఒకటి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొహర్రం తర్వాత ఈ గ్రామంలో నిశ్శబ్దం ఆవహించింది. […]
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు గురువారం భారీ వరద నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు షట్టర్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో బుధవారం రాత్రి భారీవర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు వచ్చే కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ముందస్తు చర్యగా అధికారులు ప్రాజెక్టు […]
సారథిన్యూస్, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్‌కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సారథి న్యూస్, మానవపాడు: కూతురును రక్షించబోయిన ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు (27), కూతురు మానస (4) ఇంటి ముందు ఆడుకుంటోంది.ఈ క్రమంలో ఇంటి ఎదుట ఉన్న ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. చెట్టు కొమ్మలు మీద పడతాయన్న భయంతో తండ్రి రామాంజనేయులు కూతురును రక్షించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనిపై విద్యుత్ తీగలు పడడంతో గాయాలయ్యాయి. మెరుగైన […]
సారథి న్యూస్, దేవరకద్ర: పేద ప్రజలకు సంక్షేమపథకాలను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తకోటలో గ్రీన్ ఆగ్రో స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం భూత్పూరు మండలం అన్నసాగర్, మూసాపేట మండలకేంద్రంలో పలువరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్ పల్లి బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొద్దిసేపు సందడి చేశారు. కాసేపు గాలంతో చేపలు పట్టారు. చిన్నచింతకుంట మండలంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో బండర్‌పల్లి వద్ద ఆగారు. అక్కడే చేపలు పడుతున్న వారి వద్దకు వెళ్లి గాలం తీసుకుని చేపలుపట్టారు. వాటిని చేతిలోకి తీసుకుని చూసి ముచ్చటపడ్డారు. […]
సారథిన్యూస్, నాగర్ కర్నూల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సస్పెండ్ చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కొంతకాలంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: రైతువేదికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ కలెక్టర్ శర్మన్ హెచ్చరించారు. సెప్టెంబర్ 31 నాటికి రైతువేదిక నిర్మాణపనులు పూర్తిచేయాలని సూచించారు. గురువారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోతిరెడ్డిపల్లి, కోడుపర్తి గుమ్మకొండ, తిమ్మాజిపేట, ఇప్పలపల్లి, అవంచ, మారేపల్లి, వట్టెం, బిజినేపల్లి, వడ్డేమాన్, లట్టుపల్లి, మంగనూరు, ఖానాపూర్, పాలెం ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. రైతు వేదిక పనులు నత్తనడకన కొనసాగుతున్నందున కలెక్టర్ […]