Breaking News

MAHABUBABAD

సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం సస్యశ్యామలం

సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం సస్యశ్యామలం

సారథి న్యూస్, హైదరాబాద్: మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా సీతారామ ప్రాజెక్టును విస్తరించే పనులపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒకేసారి పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్​ […]

Read More
ట్రీట్​మెంట్​ఎట్లుంది.. సౌలత్​లు ఎట్లున్నయ్​

ట్రీట్​మెంట్​ ఎట్లుంది.. సౌలత్​లు ఎట్లున్నయ్​

సారథి న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్​19 వార్డు సెంటర్​ను సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్, నీటి పారుదలశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. పీపీఈ కిట్లు ధరించి వార్డు కలియతిరిగారు. కరోనా వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. ‘ఇక్కడ సౌలత్​లు బాగున్నయా?, ట్రీట్​మెంట్ మంచిగ అందుతుందా..? మందులు బాగా పనిచేస్తున్నయా?’ స్థానికంగా అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మంచి వైద్యం అందిస్తున్నామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో […]

Read More
ఊరూరా మొక్కలు నాటాలె

ఊరూరా మొక్కలు నాటాలె

సారథి న్యూస్​, మహబూబాబాద్​: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ భవనం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆదివారం మొక్క నాటి నీళ్లు పోశారు. ఊరూరా హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, కెఎస్ఎన్ […]

Read More

గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించిన కలెక్టర్​

మహబూబాబాద్: మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ గౌతమ్ గ్రీన్​చాలెంజ్​ను స్వీకరించి కలెక్టరేట్​ వద్ద మూడు మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఓ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత, మున్సిపల్ సిబ్బంది గురు లింగం, పర్యావరణ సూపర్​వైజర్​ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Read More

విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్

మహబూబాబాద్​: మహబూబాబాద్​ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్​ ను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్​ వీపీ గౌతం ఆదేశించారు. మంగళవారం హరితహారం పల్లెప్రగతి పనులను పరిశీలించేందుకు కేసముద్రం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేసముద్రం పట్టణం, ఇనుగుర్తి, లాలూ తండా, తౌర్య తండాల్లో పర్యటించి హరితహారం తీరు తెన్నులను పరిశీలించారు. లాలూ తండాలోని 4 ఎకరాల్లో చేపట్టిన అటవీశాఖ నర్సరీని సందర్శించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీవో రోజా రాణి తదితరులు […]

Read More

బాధిత కుటుంబాలకు పరామర్శ

సారథి న్యూస్, వరంగల్: ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గిరిజన బాలుర కుటుంబాలను ఆన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్​ ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఆమె బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. శనివారం గోడతండాకు చెందిన గిరిజన పిల్లలు ఇస్లావత్​ లోకేశ్​, రాకేశ్​, జగన్​, దినేశ్​ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్​, మున్సిపల్ […]

Read More
పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించండి

పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించండి

సారథి న్యూస్​, మహబూబాబాద్​: పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్​ వీపీ గౌతమ్​ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ రూరల్ మండలం వేమునూరు, శీతల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించడంతో పాటు శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు నాటే మొక్కలు పెద్దవిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మొక్కల సంరక్షణకు గ్రామంలో ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఊరు వెలుపల నాటే మొక్కలకు సర్కారు తుమ్మ కంపను రక్షణగా ఏర్పాటు […]

Read More

కలెక్టరేట్​ పనులు వేగవంతం

సారథిన్యూస్​, మహబూబాబాద్: కలెక్టరేట్​ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మహబూబాబాద్​ కలెక్టర్​ వీపీ గౌతం ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలోని కురవిలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు. వాహనాలు రోడ్లపై నిలుపకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కొత్తగా ఐదు గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ […]

Read More