ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న వందల ట్రాక్టర్లు కాంగ్రెస్ నాయకుల ఐక్యత రాగం కదలొచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్, మధిర, ఖమ్మం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో బుధవారం చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా […]
సారథి న్యూస్, మధిర: కరోనాతో కకావిలమవుతున్న మధిర పట్టణంలో అంగుళం జాగా కూడా వదలకుండా శానిటైజేషన్ చేయిస్తున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మొదలుపెట్టి అన్ని మెయిన్‌రోడ్లు, ఇరుకైన గల్లీల్లోనూ శానిటైజేషన్‌చేశారు. కరోనా వైరస్వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చొరవను చూసి పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట మధిర మార్కెట్ కమిటీ మాజీ […]
సారథిన్యూస్, మధిర: కరోనా కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించాలని ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక, వ్యాపార సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 27 (సోమవారం) నుంచి ఆగస్టు 15 వరకు మధిరలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మెడికల్ షాపులకు మినహాయింపు ఇచ్చారు.
సారథిన్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే తలమానికమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు, వారికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్ రైతువేదికలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల […]
సారథిన్యూస్, ఖమ్మం: మధిర నియోజకవర్గం అభివృద్ధిపథంలో కొనసాగుతున్నదని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా మధిర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, మొండితోక జయకర్, బిక్కి ప్రసాద్, రంగిశెట్టి కోటేశ్వరరావు, భరత్ వెంకటరెడ్డి, అరిగే శ్రీను వైవీ అప్పారావు, ఇక్బాల్ కొటారి రాఘవరావు, కనుమూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.