సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని పలు షాపుల యజమానులకు శనివారం ఎస్సై నరేందర్ జరిమానా విధించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా ప్రతిఒక్కరూ పాటించాలని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయతీ ఈవో విఠల్, పోలీస్ […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ- తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పది గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది షాపుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఆయన […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పండగలపై పడింది. అందులో భాగంగానే శుక్రవారం రంజాన్ నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంట్లోనే నమాజ్ చేసి సెమియా, బిర్యానీ వంటి వంటకాలు తయారుచేసి భుజించారు.
సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]
సారథి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 12 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయం, మీడియా, విద్యుత్ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీబస్సులు, జిల్లా సర్వీసులు కూడా […]
సారథి, ములుగు: కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్నందున ప్రభుత్వం జారీచేసిన లాక్ డౌన్ ఉత్తర్వులను ప్రజలంతా విధిగా పాటించాలని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా బయట తిరిగే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన ములుగు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కేసునమోదు చేశామని, అంతేకాకుండా కొవిడ్ నిబంధనలు పాటించకుండా, సామాజిక దూరం పాటించకుండా కిరాణ సరుకులు అమ్మిన నవీన్ రెడ్డిపై […]
* రాజన్న సన్నిదిలో కొడేమొక్కులు రద్దు సారథి, వేములవాడ: శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందింది. రాజన్న ఆలయంలో కారోన వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోంది. దీంతో గురువారం నుండి రాజన్న ఆలయంలో కోడె మొక్కుబడితో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి పాలకవర్గం, అధికారులతో ఏర్పాటు చేసి అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడుతూ […]