న్యూజిలాండ్: హోం క్వారంటైన్లో ఉన్న ఓ కరోనా రోగి మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సాహసమే చేశాడు. ఇనుపకంచెను తెగ్గొట్టి దాని దాటుకుంటూ వెళ్లి మద్యం కోనుగోలు చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకున్నది. న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి(52) కి ఇటీవల కరోనా సోకగా.. అక్కడి ప్రభుత్వమే అతడిని హోంక్వారంటైన్లో ఉంచింది. క్వారంటైన్ కేంద్రం చుట్టూ భారీ ఇనుపకంచెలు కూడా ఏర్పాటు చేశారు. కాగా అందులో ఉంటున్న ఓ కరోనా రోగి మందు తాగాలనిపించంది. […]
సారథిన్యూస్, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్‌లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శేఖర్, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులైంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగామని భావిస్తున్న దేశాలు కూడా వైరస్ కాటుకు కకావికలమయ్యాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి. లాక్‌డౌన్ కాలంలో పరిశ్రమలు, దుకాణాలతో పాటు అన్నిరంగాలు మూసివేశారు. దీంతో వ్యాపారం జరగలేదు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కూడా రావడం లేదు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపు తర్వాత […]
సారథి న్యూస్, హైదరాబాద్: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. ఆ తెలివితోనే ఎదుగుతున్నారు కొందరు. ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు విధిస్తే వాటినుంచి తప్పించుకొని ఎలా సంపాదించాలోననే ఆలోచనల కోసం వారి మెదడుకు పని పెడుతున్నారు. సర్కారు కంటే మెరుగ్గా ఆలోచన చేసి భారీగా సంపాదిస్తున్నారు. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం విధించే క్రమంలో అక్కడి సీఎం మద్యం ధరలను భారీగా పెంచారు. దుకాణాల సంఖ్యను కూడా సగానికి సగం తగ్గించారు. దీంతో మద్యం కొనుగోలు చేయలేక […]
తెరుచుకున్న మద్యం షాపులు వైన్స్ వద్ద విపరీతమైన రద్దీ కొద్దిసేపటికే స్టాక్ లేక మూత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు సారథి న్యూస్, మెదక్: నెలన్నర రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైన్స్ తెరచుకోడంతో మద్యం ప్రియులు షాపుల ఎదుట బారులుదీరారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుకుని, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులను వరుసలో పెట్టడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా, […]