సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హాజరయ్యారు. చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా హక్కుల రక్షణ కోసం కమిషన్ ఆవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం ప్రగతి భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖ శ్యాంనాయక్ కలిశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరుచేసి సహకరించాలని కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వారి వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్ ఉన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని గత కొద్దిరోజులుగా దేశరాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 8న రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు సహకరించాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని హైవేలపైకి వచ్చి నిరసన తెలుపుతామని అన్నారు. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక […]
సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగడి సునిత, రేగా కాంతారావు, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంగళవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కుందన్‌బాగ్ పోలింగ్ బూత్‌లో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబసమేతంగా తమ ఓటువేశారు. అలాగే సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూలులో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డు నం.97, సెంటర్ ఫర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరిరోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాటిగడ్డ చౌరస్తా, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. టీఆర్ఎస్ప్రభుత్వం ఈ ఆరేళ్లలో […]