సారథి న్యూస్, మహబూబ్‌నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్గౌడ్తండ్రి నారాయణగౌడ్కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు క్లారిటీ ఇచ్చిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో వెల్లడి సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని టీఆర్ఎస్అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎంగా తానే కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందే చెప్పినా ఎందుకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి స్థాయి వరకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే మరో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నామని మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే 1.31లక్షల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్ సమస్య లేదన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. దేశంలోనే పారిశ్రామిక రంగానికి సరిపడా కరెంట్ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సమావేశంలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మొత్తం 57 రకాల రక్తపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో వైద్యులు, ఇతర సిబ్బంది అందించిన సేవలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని గుర్తుచేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం ప్రగతి భవన్ లో నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. కాబోయే సీఎం అని శుభాకాంక్షలు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును బుధవారం హైదరాబాద్ వాటర్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఎస్సీ, ఎస్టీ వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.1.23 కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్ లను అందించారు. వాటిని సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, […]