ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ […]
స్వీటీ అనుష్క సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ఎప్పటికప్పడు ఫ్యాన్స్‌తో విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతున్నది. రీసెంట్గా నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇన్‌స్టాలో అనూష్కను ఫాలో అయ్యేవారి సంఖ్య 4 మిలియన్లకు చేరిందట. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది స్వీటీ. ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం […]
ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్‌తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్‌గా మారాయి.
‘సాహో’ చిత్రంలో హీరోయిన్గా నటించిన శ్రద్ధాకపూర్ ఇప్పడు ఓ బోల్డ్ పాత్రలో నటించనున్నట్టు సమాచారం. గతంలో అమలాపాల్ నటించిన ‘అడాయ్’ (తెలుగులో ఆమె) చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ నటించనున్నట్టు టాక్. అడాయ్ చిత్రం అమలాపాల్‌కు ఎంతో పేరుతెచ్చింది. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో అమలా నగ్నంగా నటించింది. అప్పట్లో అమలాపాల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రస్తుతం శ్రద్ధాకపూర్ నటించనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియా సినిమా రానుంది. ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ సినిమాలతో లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లు అందుకున్నాడు అజిత్. అదే ఏడాది డిసెంబర్‌లో తన కొత్త సినిమా ‘వలిమై’ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ షూటింగ్ జరిగింది. లాక్ డౌన్‌కు ముందు 40శాతం వరకూ షూటింగ్ చేశారు. ‘పింక్’ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ తర్వాత […]
తెలుగులో బోలెడు సినిమాలు చేసి కోలీవుడ్‌లో పాగా వేసింది హీరోయిన్ త్రిష. అక్కడ ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతకు ముందు మాదిరిగా గ్లామర్పాత్రలు కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటోంది. అలాగే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది కూడా. అందుకేనేమో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఆఫర్ వచ్చినా వద్దనుకుంది అంటున్నారు. అయితే త్రిష గర్జనై, రాంగీ, పొన్నియన్ సెల్వం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురువారం 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూర్య అభిమానులకు వరుసగా మూడు సర్ప్రైజ్ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఖాతాను తెరవడం, రెండోది ‘ఆకాశం నా హద్దురా’ సినిమా నుంచి కాటుక కనులే అంటూ సాగే పాట ప్రోమో విడుదల చేయడం.. మూడవది వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘వాడి వాసల్’ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ‘వాడి వాసల్’ లుక్ లో పల్లెటూరి వాడిలా […]
‘ఫగ్లీ’మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ‘ఎమ్ఎస్ ధోని’ మూవీతో అక్కడ, ‘భరత్ అను నేను’తో తెలుగునాట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్గా ‘కబీర్ సింగ్’తో మరింత స్టార్ డమ్ మూటగట్టుకుంది. దాంతో కియారా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో తన అందాలతో కిక్ ఎక్కించిన కియారా ఇప్పుడు కోలీవుడ్ లో అడుగుపెట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం అందిబుచ్చుకుందని ప్రచారం […]