బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు పాక్ ఉగ్రవాది అబూజరార్‌ను మంగళవారం హతమార్చాయి. జరార్ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్ ఆపరేషన్’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్‌ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారు. పూంచ్, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో 24 గంటల్లో వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు.
వాషింగ్టన్: రెండు విమానాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్నది. విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయాయి. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.
సారథి న్యూస్, వరంగల్ రూరల్: కరీంనగర్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓ యువతి కరోనా లక్షణాలతో మృతిచెందింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సదురు యువతిని గురువారం తల్లిదండ్రలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించే లోపే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా పాపయ్యపేటలో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్లో ఉంచారు. గ్రామస్థులంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన రౌడీ షీటర్ వికాస్ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]
నాగ్‌పూర్: మద్యం దొరకలేదని శానిటైజర్ తాగిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన గౌతమ్ గోస్వామి (45) స్థానిక మున్సిపాలిటీలో క్లీనింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం దొరకపోవడంతో శానిటైజర్ తాగితే కిక్కు వస్తుందని భావించిన గోస్వామి తన ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యలు చికిత్సచేసి పంపించారు. రెండ్రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.
కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ భద్రతా దళాలు చేతిలో హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అహ్మద్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్రవాదరహిత’ జిల్లాగా మారినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్, రెండు తుపాకులు స్వాధీనం […]