చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సామాజిక సారథి, జనగామ: ధాన్యం కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి అనడం అత్యంత చేతకాని సిగ్గుమాలిన చర్య అని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో రూ. 1లక్ష10వేల కోట్ల అప్పులు చేసి, కమీషన్లతో కేసీఆర్ ఆరాచకపాలన కొనసాగుస్తూరని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి […]
సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, జనగాం: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ముఖ్య […]
ధ్వంసమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమ కట్టడాలు జనాగ్రహానికి ధ్వంసమైన యాదగిరిరెడ్డి కబ్జా భూమి పోలీసుల రంగ ప్రవేశం, అఖిలపక్షనాయకుల అరెస్టు సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. అక్రమ నిర్మాణం చేపట్టారని విపక్ష నాయకులు, కార్యకర్తలు వాటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి పెద్దచెరువు కింద భాగంలో కొంత ప్రదేశాన్ని దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. భూమిని ఎమ్మెల్యే […]
ప్రతి 5వేల ఎకరాలకు రైతువేదిక ఏర్పాటు హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ ప్రతిపక్షాల అసత్యప్రచారాలను నమ్మొద్దు రైతు ఆత్మీయ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు జనగామ జిల్లా కొడగండ్లలో రైతువేదిక ప్రారంభం సారథి న్యూస్, జనగామ: రైతు సంక్షేమమే ప్రధానధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా భూమిపై హక్కులకు సంపూర్ణ రక్షణ ఉంటుందన్నారు. శనివారం జనగామ జిల్లాలోని కడగండ్ల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు తమ సమస్యలను చర్చించేందుకే […]
సారథి న్యూస్, జనగామ: జనగామ జిల్లా కొండకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామం నుంచి మంగళవారం కొండకండ్ల మండల కేంద్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలను చూసి కారు ఆపారు. వారికి మాస్కులు లేకపోవడంతో వాటిని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కూలీలకు సూచించారు.
సారథి న్యూస్, జనగామ: పేలుడు స్వభావం కలిగిన అమ్మోనియం నైట్రేట్ బస్తాలను జనగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీఐ రాపెళ్లి సంతోష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నర్మెట్ట మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పున్నెరెడ్డి కృష్ణారెడ్డికి చెందిన వెంకటసాయి గోదాం నుంచి పేలుడు పదార్థాలకు వినియోగించే ముడి సరుకును రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో అమ్మాపురం, వెల్దండ, పోతారం చౌరస్తాలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 50 […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథి న్యూస్, జనగామ: నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సూచించారు. ఆదివారం జనగామలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను రాజులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి ఇచ్చి సాగును ప్రోత్సహిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, తాటికొండ […]