సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్ లేపింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి కూతురు రాత్లావత్ నందిని బాలానగర్‌లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్‌నాయక్ మరిది […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ మీడియట్బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్‌బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్‌లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.
సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.
సారథి న్యూస్, బెజ్జంకి: విద్యార్థులు తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. బుధవారం బెజ్జంకి ఆదర్శ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రవళిక(973, బైపీసీ), స్వీటీ (971 ఎంపీసీ)లను అభినందించారు. అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఎస్సీఈఆర్టీ 1నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల స్కూలు టెక్ట్స్ బుక్స్ ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఇవి పీడీఎఫ్ రూపంలో ఈ వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కావాల్సిన వారు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.Telangana Board Textbooks @scert.telangana.gov.in