వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]
సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]
సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]
సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ సమయానికి ఆఫీస్‌కు రారని.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కలెక్టర్ పర్యటనలో తేలింది. కొత్త కలెక్టర్ శర్మన్ విధుల్లో చేరినప్పటినుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికపర్యటనలు చేస్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన నాగర్‌కర్నూల్‌లో కాలినడకన తిరిగి పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉదయం 10:15 గంటలకు డీఆర్వో మధుసూదన్ నాయక్ తో కలిసి […]
సారథిన్యూస్, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా జడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి సోమవారం దామెర మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె అధికారులతో మాట్లాడి.. మండలం లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యపనులను చేపట్టాలని కోరారు.
సారథిన్యూస్, మహబూబాబాద్: పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇల్లందు బై పాస్ రోడ్ లో కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురికి కాల్వల్లో చెత్తను ఏరోజుకారోజు తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచించినట్టుగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలపాటు నిలువ ఉన్న నీటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలోని పలు టైర్ల షాపులను పరిశీలించారు. అక్కడ నీరు […]