ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో పాకిస్థాన్‌లో అదుపులో ఉన్న కుల్‌భూషన్ జాదవ్‌ను కలిసిందేకు పాకిస్తాన్ భారత్‌కు పర్మిషన్ ఇచ్చింది. జాదవ్‌ను అధికారులు మూడోసారి కలవనున్నారు. ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చిన వెసులుబాట్లను పాక్ కల్పించడం లేదని, కోర్టు తీర్పును పక్కనపెట్టిందని ఇండియా ఆరోపించిన నేపథ్యంలో అతన్ని కలిసేందుకు పాక్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. పాకిస్తాన్ అధికారులు లేకుండా కుల్‌భూషన్ యాదవ్‌ను కలిసేందుకు వీలు కల్పిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లాంటి […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,06,752 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీరేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో 28,000 కొత్తకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23,727 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 5,71,459 మందికి కరోనా రోగులకు వ్యాధి నయమైంది. కాగా 3,11,565 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
న్యూఢిల్లీ: భారత్‌లో గుగూల్ సంస్థ రూ. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదేండ్లలో ఈ పెట్టుబడి పెడతున్నామని చెప్పారు. డిజిటల్ ఇండియా కోసం ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రయత్నాలకు మద్దతివ్వడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులసంఖ్య భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్నది. కేవలం గత నాలుగు రోజుల్లేనే లక్షకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 8,49,553కు చేసింది. గత 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా శనివారం 2,80,151 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,20,916 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,114 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 2,83,407 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 22,123 మంది కరోనాకు బలయ్యారు. 5,15,385 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలంతా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు […]