న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకున్నది. గత 24 గంటల్లోనే 64,553 కొత్తకేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 48,040 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 17,51,555 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,61,595 మంది వివిధ దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60,963 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 56,110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడం ఊరట నిచ్చే అంశం. ఇప్పటివరకు 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 70.38 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 23,29,638 కి చేరుకున్నది. ఇప్పటివరకు 46,091మంది కోరోనా మృతిచెందగా.. 6,43,948 మంది వివిధ […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. ఇప్పటివరకు 22,15,074 కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లోనే 62,064 మందికి కొత్తగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 6,34,949 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 44,386 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,077 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 2.45 కోట్ల పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 60 వేల కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులసంఖ్య 20,88,611కు చేరుకున్నది. ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 14,27,005 మంది డిశ్చార్జి అయ్యారు. 6,19,088 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంట్లో 933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరక శనివారం కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కరోనా లక్షణాలు […]
ఢిల్లీ: నూతన విద్యావిధానంతో మన దేశంలో పెనుమార్పులు సంభవించనున్నాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నూతన విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇక విద్యార్థులు వారికి ఇష్టమైన కోర్సును చిన్నప్పడే ఎంచుకోవచ్చని.. హోంవర్కులు, పుస్తకాల మోత ఉండబోదని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుందని.. నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుందన్నారు. సృజనాత్మకత నిశిత పరిశీలన పెంపొందుతుందన్నారు. […]
పుణే: కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్‌కు చెందిన పలు ఫార్మా కంపెనీలు పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (జీఏవీఐ) భాగస్వామ్యంతో భారతదేశంతో సహా 92 దేశాలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నది. కాగా దీని ధర రూ. 225 గా […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 20,27075 మందికి కరోనా సోకగా, 41,585 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,07384 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. […]