సారథి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్) ఫలితాలను గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్షను ఈనెల 11వ తేదీన నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in అలాగే www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. సంబంధిత […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్‌నంబర్, ఆధార్నంబర్ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్ ఇస్తారు. మరిన్నివివరాలకు […]
సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ చేయాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, […]
సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్ లో నిర్వహించిన స్వేరోస్ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ గురుకులాలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.పోస్టులు ఇవేతెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, పిజిక్స్, బోటనీ , జువాలజీ, జియాలజి, కామర్స్ మాథ్స్, ఎకానామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రో బయాలజీ, సోషయాలజి, సైకాలజీ, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రఫీ, ఫుడ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని గురుకుల కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 వరకు ఉన్న గడువును 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌మీడియట్ ఫస్టియర్‌లో బాలబాలికలకు, మహిళా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్‌లో అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, […]
సారథిన్యూస్, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలను వనపర్తి జిల్లాకు తరలించడం సరికాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ నేతలు బిజినేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దాదాపు 540 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, ఈశ్వర్, పాషా, బలమాసయ్య, మిద్దె సూరి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండడంతో స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. చదువుతున్న స్కూలు, ఇంటర్‌మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్‌కు ‘జ్ఞానదీక్ష’పేరుతో ‘దూరదర్శన్–యాదగిరి’ చానెల్ద్వారా ఆన్‌లైన్ పాఠాలు చెప్పనున్నారు. ప్రతిరోజు అరగంట పాటు(30 నిమిషాలు) మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు పాఠాలు ప్రసారం చేయనున్నారు. జులై 6 నుంచి […]