సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవభక్తిని లక్ష్మి అనే మహిళ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శబరి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై బస్సు దిగి నడుచుకుంటూ మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళుతుంది. ఈ సమయంలో […]
సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]
తిరువనంతపురం: షార్జా నుంచి అక్రమ పద్ధతిలో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన రూ.60.26 లక్షల విలువైన 1,357 గ్రాముల బంగారాన్ని కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
20తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరణ సారథి న్యూస్, జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో షేరల్లి విధికి చెందిన జాహిరబేగం ఇంట్లో 20తులాల బంగారు ఆభరణాలు, రూ 40వేలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ చేసినట్లు బాధితులు నసిర్ తెలిపారు. బాధితులు నసిర్ తెలిపిన వివరాలు: సోమవారం మధ్యాహ్నం తమ అక్క జాహిరబేగం ఆమె కూతురు గద్వాల పట్టణంలోని ఆఖర్అలీవిధి లో బంధువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో […]
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ధాటికి బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. మంగళవారంర 10 గ్రామాల బంగారం రూ.50,670కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పుంజుకున్న ధరలు, దేశీయస్టాక్ మార్కెట్లలో అమ్మకాలు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనం నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. కేజీ వెండి రూ.48,510 పలుకుతోంది. గ్రాము వెండి రూ.485.10 ఉంగా, 10 గ్రాముల వెండికి రూ.4,851 ఉంది.