![అనవసరంగా బయటికొస్తే అంతే..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/rmg-1.jpg?fit=638%2C330&ssl=1)
సారథి ప్రతినిధి, రామగుండం: లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి వచ్చిన వారిని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని పోలీసులు ఐసొలేషన్ సెంటర్ కు తరలించారు. ఏసీపీ ఉమెందర్ ఆధ్వర్యంలో సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, ఉమాసాగర్, సతీష్, రమేష్ లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. బయట తిరిగిన 20 వెహికిల్స్ ను సీజ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రతి గల్లీల్లో పెట్రోలింగ్ నిర్వహించగా, కారణం లేకుండా బయట తిరుగుతున్న 20 మందిని పట్టుకుని స్థానిక ప్రభుత్వ ఏరియ ఆస్పత్రిలో కరోనా రాపిడ్ టెస్టులు చేయించినట్లు తెలిపారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.