సారథి, రాముగుండం ప్రతినిధి: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బల్మూరి అమరేందర్ రావు ఎన్నికయ్యారు. మొత్తం 178 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 104 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి మేడ చక్రపాణికి 55 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన జవ్వాజి శ్రీనివాస్ కు 86ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి చందాల శైలజకు 81 ఓట్లు పడ్డాయి. కోశాధికారిగా బరిలో నిలిచిన ఈ.నరసయ్యకు 62, గుల్ల రమేష్ కు 55 ఓట్లు వచ్చాయి. బోడసమ్మయ్యకు 49 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా టి.శ్రీపతి కుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా ముష్కి రవికుమార్ యాదవ్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా ఎరుకల ప్రదీప్ కుమార్, లైబ్రరీ కార్యదర్శిగా నూతి సురేష్ కుమార్, మహిళాప్రతినిధిగా మహేశ్వరం రాగిణి, మహిళా కార్యవర్గ సభ్యురాలుగా చెలకల పద్మజ, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా కొత్తకాపు సుధాకర్ రెడ్డి, కార్యవర్గసభ్యులుగా అశోక్, జూనియర్ కార్యవర్గ సభ్యులుగా భారతిదేవి చౌహాన్, ఎండీ ఉమర్, బోయిన శ్రీనివాస్, ముచ్చకుర్తి కుమార్ ను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కొసన శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారిగా షానవాజ్ వ్యవహరించారు.
- March 30, 2021
- Archive
- bar association
- GODAVARIKHANI
- PEDDAPALLY
- RAMAGUNDAM
- గోదావరిఖని
- పెద్దపల్లి జిల్లా
- బార్ అసోసియేషన్
- రామగుండం
- Comments Off on బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక