సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. యాక్టివ్ కేసులు 5,109 ఉన్నాయి. వ్యాధిబారినపడి 4,224 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 220కు చేరింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 64, మేడ్చల్ జిల్లా నుంచి 112, వరంగల్ రూరల్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10చొప్పున కేసులు నమోదయ్యాయి.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్త ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శనివారం మొదటిసారి కొత్తగా 546 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 203కు చేరింది. రాష్ట్రంలో కేసులు 7072కు చేరాయి. ఇప్పటివరకు 53,757 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 3,363 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స […]
సారథి న్యూస్ హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొండాపూర్, సరూర్‌నగర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో 50వేల కరోనాటెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధి నుంచే 132 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,650 కు చేరింది. ఆదివారం ఒకే రోజు 14 మంది […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈనెల 23న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని ఆలయం వేదపండితుల సమీక్షంలోనే జరిపించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం దేవాదాయ, జీహెచ్ఎంసీ, పోలీసుశాఖ అధికారులతో సమీక్షించారు. భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున.. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు శేషుకుమారి, కొలాన్ లక్ష్మి, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) భూములను రీసర్వే చేయించి భూ కబ్జాదారులు నుంచి కాపాడాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. వేలమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ.. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఓయూ భూములను కాపాడాలని వారు కోరారు.
క్లబ్‌లు, పబ్‌లు, జిమ్ లు బంద్ కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి హైదరాబాద్ మెట్రోరైల్ బంద్ సెలూన్లు తెరుచుకోవచ్చు ఈ-కామర్స్ ను అనుమతిస్తున్నం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడుస్తాయని వెల్లడించారు. కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో […]