‘గద్దలకొండ గణేష్’ లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించిన పూజాహెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ తో అభిమానులను అలరించనుంది. తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో సందడి చేయనుంది. ఇవి కాక బాలీవుడ్లో భాయ్ సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కబీ దీవాలీ’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘సర్కస్’ మూవీ కి కమిట్మెంట్ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ గాళ్ ఇప్పుడొక హిస్టారికల్ మూవీలో నటించనుందని టాక్. చారిత్రక కథలను అద్భుతంగా […]
సారథిన్యూస్, రామగుండం: రామగుండం కమిషనరేట్ పరధిలో గణేశ్ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలకేంద్రంలో నాలుగు చోట్ల మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆయాగ్రామాల్లో ప్రజలంతా కలిసి ఓకేచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పోలీస్‌స్టేషన్‌లో వినాయకమంటపాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దశంకరంపేటలోని శ్రీరామ్ మందిర్, ప్రభుమందిర్, విట్టలేశ్వరమందిర్, మార్కండేయ మందిర్‌లో వినాయక విగ్రహాలను ఏర్పాటు […]
సారథి న్యూస్, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.
హైదరాబాద్: గణేష్ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. గత ఏడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహాగణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుని విగ్రహ ఎత్తు ఈ సారి తగ్గింది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం కానుంది. అంటే విగ్రహం ఎత్తు కిందటి సంవత్సరం కన్నా 38 అడుగుల మేరకు తగ్గనుంది. ఎత్తు తగ్గనున్న కారణంగా పూర్తిగా మట్టి […]