ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా […]
కరోనా నిలకడగానే ఉంది మూడో దశ ముప్పుపట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్: కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి సోమవారం కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, […]
సారథి న్యూస్, అలంపూర్: జూన్ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని 1 నుంచి 12 వ తరగతి వరకు 25 శాతం వరకు సిలబస్‌ను తగ్గించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎంఎస్‌సీఈఆర్‌టీ) ఆమోదం తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరంలో సిలబస్ కోతను విధించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే 9 నుంచి 12 […]
సారథిన్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ స్ఠాయి విద్య అందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని ఇందిరానగర్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో మదన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యావేత్తలు, విషయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుందాం విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికడదాం యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలి ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్కూళ్లను ప్రారంభించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: విద్యారంగ సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్బీ) 70 ఏండ్లుగా పోరాడుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఏఐఎస్బీ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలుగూరి సూర్యకిరణ్, అతికం రాజశేఖర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బద్ధం ప్రవీణ్ రెడ్డి, చల్లురి విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.