Breaking News

COLLECTOR

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

 సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సంగారెడ్డి మండలం ఫసల్ వాది పుల్కల్ మండలం చౌటకూర్, శివంపేట గ్రామాలలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు  ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయంటూ రైతులను ఆరా తీశారు.  మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకుని రసీదులు ఇవ్వాలని మిల్లర్లకు […]

Read More
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ వీరారెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి: ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలతో వచ్చిన సుమారు 50 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా అధికారి రాధికరమణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అర్జిదారులు పాల్గొన్నారు.

Read More
ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

– కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  ప్రశాంతంగా పారదర్శకంగా వైన్స్ షాపుల కేటాయించామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపపల్లి ఎక్స్ రోడ్డులోని ఎంబీఆర్ గార్డెన్ లో లక్కీడ్రాలో పాల్గొని మాట్లాడారు.  జిల్లా వ్యాప్తంగా 101 మద్యం దుకాణాలకు గాను 2,310 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అమిన్పూర్ మున్సిపాలిటీలోని  43 నెంబర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలలోని […]

Read More
పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటి పచ్చదనం పెంచి అందమైన జగిత్యాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. జగిత్యాల నుంచి థరూర్ క్యాంప్, రాజరాంపల్లి, నూకపల్లి, మాల్యాల చౌరస్తా రోడ్డు, ముత్యంపేట, దొంగలమర్రి, పుడూరు, తుర్కకాశీనగర్, రైల్వే ట్రాక్ వరకు జాతీయ రహదారి 65కు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న మొక్కలు నాటే పనులను మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ […]

Read More
విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ తప్పనిసరి

సారథి న్యూస్, ములుగు: కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల వరకు క్వారంటైన్​లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణాఆదిత్య సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల వైద్యాశాఖ అధికారులతో కోవిడ్ -19 వాక్సిన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. పీహెచ్​సీల్లో […]

Read More
బాలల హక్కులు కాపాడాలి

బాలల హక్కులు కాపాడాలి

సారథి న్యూస్, ములుగు: బాలల హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్​జీ ఆనంద్ సూచించారు. గురువారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడారం టోర్నమెంట్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో ఆటలపోటీల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం […]

Read More
ప్రకృతివనాల పనులు పూర్తవ్వాలే

ప్రకృతివనాల పనులు పూర్తవ్వాలే

సారథి న్యూస్, మెదక్: ఈనెల 11వ తేదీలోగా మెదక్ ​జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేవించారు. శుక్రవారం ఆయన కల్లెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 429 పంచాయతీలతో పాటు గుర్తించిన 84 మదిర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 27లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అధికారులు ఒక స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ధరణి అద్భుతంగా పనిచేస్తోందన్నారు. […]

Read More
కురుమూర్తి జాతరకు రావొద్దు

కురుమూర్తి జాతరకు రావొద్దు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: వచ్చే కురుమూర్తి జాతరకు ప్రజలెవరూ ఆలయానికి రావద్దని, ఇళ్ల వద్దనే పూజలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్​హాల్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కురుమూర్తి జాతర ఉత్సవాలకు మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇళ్లవద్దనే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయాధికారులు కరోనా నిబంధనలు […]

Read More