Breaking News

CHEVELLA

కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ చీఫ్​

కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ చీఫ్​

సారథి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాతృమూర్తి కొండా జయలతాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​సోమవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొండా జయలతాదేవి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి, ఎస్.కుమార్, సంగప్ప తదితరులు ఉన్నారు.

Read More
ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- బీజాపూర్‌ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ లోని తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఇరుక్కున్న శవాలు బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

ఐలమ్మ ఆదర్శ మహిళ

సారథిన్యూస్, రామాయంపేట / చేవెళ్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆదర్శమహిళ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆమెకు నివాళి అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల మండల కేంద్రంలో రజకసంఘం, కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ […]

Read More
ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను గుర్తించండి

ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను గుర్తించండి

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు శుక్రవారం సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ ​నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించేలా ముందుకు పోతున్నామని, దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, […]

Read More
దళిత రైతులపై ఎమ్మెల్యే మనుషుల రుబాబు

దళిత రైతులపై ఎమ్మెల్యే మనుషుల రుబాబు

సారథి న్యూస్, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై కొందరు తాము ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులమని రుబాబు చూపించారు. దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వేనం.116లో 15 ఎకరాల పట్టా భూమి ఉంది. దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుల పేరుతో 30 మంది రెండు జేసీబీలు […]

Read More
మార్కెట్ ఆఫీసు ప్రారంభం

మార్కెట్ ఆఫీసు ప్రారంభం

సారథి న్యూస్, చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని శంకర్ పల్లి లో నూతనంగా రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసును ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More

ఊరు శుభ్రత అందరి బాధ్యత

చేవెళ్ల సర్పంచ్ శైలజాఆగిరెడ్డి సారథి న్యూస్, చేవెళ్ల: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిపై ఉందని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి సూచించారు. శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలనీలతో పాటు షాపుల ఎదుట పరిశుభ్రతను పాటించాలని సర్పంచ్​ సూచించారు. తడి పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ వాహనంలో వేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సున్నపు వసంతం, […]

Read More
సబ్సిడీపై జనుము విత్తనాలు

సబ్సిడీపై జనుము విత్తనాలు

పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్​ సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల సొసైటీ పరిధిలోని రైతులకు శనివారం పీఏసీఎస్​ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డితో కలిసి సబ్సిడీపై జనుము విత్తనాలను పంపిణీ చేశారు. వంద కిలోల బస్తా రూ.6,600 ఉండగా, రూ.4,290 సబ్సిడీ పోనూ రైతులు రూ.2,310 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు, సర్పంచ్​ల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, పీఏసీఎస్​ వైస్ చైర్మన్ చిలుకూరి […]

Read More