Breaking News

CARONA

కరోనా కట్టడిలో విఫలం

సారథి న్యూస్​, హుస్నాబాద్ : కరోనా రోగులకు వైద్యం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేశ్​ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్​డౌన్​ను సడలించడంతో కరోనా విజృంభిస్తుందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా టెస్టులసంఖ్య పెంచాలని డిమాండ్​ చేశారు.

Read More

ఇంట్లోనే.. కోవిడ్​ చికిత్స

సారథిన్యూస్​, హైదరాబాద్​: దేశంలో కరోనాకేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 10వేల కొత్తకేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులతో దవాఖానలు నిండిపోతున్నాయి. వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్సనందించడం సాధ్యం కాకపోవచ్చు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ ‘క్లినికల్‌ గైడెన్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ కరోనా’పేరిట నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వ్యాధి తీవ్రతను బట్టి కరోనారోగులను విభజించి.. తీవ్రత తక్కువగా ఉన్న రోగులకు ఇంట్లోనే వైద్యం అందించవచ్చని సూచించింది. మూడువర్గాలుగా కరోనా […]

Read More

వరుడు ఐసోలేషన్‌లో..వధువు క్వారంటైన్‌లో!

సారథిన్యూస్​, వెల్దుర్తి: పెళ్లయిన రెండోరోజే వరుడిని ఐసోలేషన్​కు, వధువును క్వారైంటైన్​కు తరలించిన ఘటన ఏపీలోని కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకున్నది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. కాగా అతడికి వెల్దుర్తి మండలం ఎల్​ తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు అతడి నమూనాలు సేకరించారు. అయినప్పటికి యువకుడు ఈ నెల 10న ఎల్​ తండాకు వచ్చి అక్కడ యువతిని వివాహం […]

Read More
కరోనా టెస్ట్​

మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా!

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, ఉన్నతాధికారులు, రాజకీయనేతలను సైతం కరోనా వణికిస్తున్నది. తాజాగా జనగామ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్​ రావడంతో మేయర్​ కుటుంబం హోంక్వారంటైన్​లోకి వెళ్లిపోయింది. తాజాగా మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా సోకడంతో హరీశ్​రావు కుటుంబం హోంక్వారైంటైన్​కు వెళ్లినట్టు సమాచారం. మరోవైపు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జెడ్పీటీసీలు కలెక్టర్‌ను […]

Read More

శుభ్రంగా ఉంటేనే కరోనా దూరం

సారథి న్యూస్, బిజినేపల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించి కరోనాను దూరం చేసుకోవచ్చని వైద్యాధికారి డాక్టర్ కల్పన సూచించారు. శుక్రవారం ఆమె నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్​ గ్రామంలో మాస్కులను పంపిణీ చేశారు. చేతులను తరుచూ సబ్బు లేదా శానిజైటర్​తో శుభ్రం చేసుకోవాలని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హెల్త్​ సూపర్​వైజర్​ గోవిందు సుజాత, మాజిద్, సర్పంచ్ సితార, ఎంపీటీసీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
RAMAYAMPETA1

రామాయంపేటలో ఒకరికి కరోనా!

సారథి న్యూస్, రామాయంపేట: హైదరాబాద్​కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా మారుమూల పట్టణాలకు విస్తరిస్తున్నది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్​ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో ఆంక్షలు విధించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్​లో ఓ విందుకు హాజరైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Read More

రాజస్థాన్‌ సరిహద్దులు బంద్​

జైపూర్‌‌: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సరిహద్దులు మూసివేస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారం పాటు ఈ మూసివేత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్​లు ఉన్నవారిని మాత్రమే ఇతర రాష్ట్రాలకు అనుమతించనున్నారు. నాన్‌ అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్వోసీ) లేనివారిని రాష్ట్రంలోని అనుమతించేంది లేదని డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎమ్‌ ఎల్‌ లాథర్‌‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతే […]

Read More

నాగర్ కర్నూల్​ జిల్లాలో మరో పాజిటివ్ కేసు

వెల్లడించిన కలెక్టర్ శ్రీధర్ సారథి న్యూస్, నాగర్ కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లా చారకొండ మండలం రామచంద్రాపురంలో ఈ నెల 23న కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా బుధవారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీధర్ అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో కరోనా నివారణ చర్యలపై కల్వకుర్తి ఆర్డీవో ఆఫీసులో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ […]

Read More