Breaking News

BJP

తమిళనాడులో బీజేపీ కొత్త ఎత్తులు

తమిళనాడులో బీజేపీ కొత్తఎత్తులు

చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్​ వీరప్పన్​ కూతురు విద్యావీరప్పన్​కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని […]

Read More
ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

జైపూర్‌‌: రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్‌ ట్యాప్‌ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్‌ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా నిలదీశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఫోన్‌ […]

Read More

ఆడియో టేపులపై సీబీఐ విచారణ

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షేకావత్​ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే ఆ వాయిస్​ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్​ పాత్రా డిమాండ్​ చేశారు.

Read More

ఆడియో క్లిప్పులతో దొరికిపోయారు

జైపూర్‌‌: రాజస్థాన్‌ పొలిటికల్‌ డ్రామా రోజుకో మలుపు తిరుతున్నది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌ మరో ముందు అడుగు వేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షకావత్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భన్వర్‌‌లాల్‌ శర్మపై కేసు పెట్టింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోయారని విచారణలో వెల్లడైందని చెప్పింది. బీజేపీతో డీలింగ్‌ పెట్టుకున్నారని ఆడియో […]

Read More

బీజేపీని బలోపేతం చేద్దాం

సారథి న్యూస్, రామడుగు: భారతీయ జనతాపార్టీని బలోపేతం చేద్దామని కరీంనగర్​ జిల్లా రామడుగు మండలాధ్యక్షుడు కరుణాకర్​రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామడుగు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్​రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అంబటి నర్సింగరావు, కారుపకల అంజి, ఏముండ్ల కుమార్, తారకొండ ఐలయ్య, ప్రధానకార్యదర్శులుగా తోట, కృష్ణ, రమేశ్​, చంద్రమౌళి, కార్యదర్శి గుంట అశోక్, చింతాపంటి అశోక్, సిరిమల్ల మదన్మోహన్, దమ్మయ్య భూపతి, కోశాధికారి గంట్లా శరత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా స్వామి, శ్రీధర్, కనకయ్య, […]

Read More
బీజేపీ డిమాండ్​

దవాఖాన ఎప్పడు కడతరు

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్​లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్​ దొడ్డి శ్రీనివాస్​ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్​లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

సచిన్​ పైలట్​కు మరో షాక్​

న్యూఢిల్లీ: సొంతపార్టీపైనే తిరుగుబాటు చేసి రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సచిన్‌పైలెట్‌పై చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ బుధవారం ఉదయం తాజాగా నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో చెప్పింది. సచిన్‌ పైలెట్‌తో పాటు ఆయన తరఫు 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత వాళ్లు ఇచ్చే వివరణను బట్టి సీఎల్పీ […]

Read More

బీజేపీలో చేరడం లేదు

న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్​ బహిష్కృత నేత సచిన్​ పైలట్​ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్​ పైలట్​ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్​ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన […]

Read More