– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా […]
సారథి న్యూస్, ఎల్బీనగర్ (హైదరాబాద్): కరోనా నుంచి ప్రజలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం ఎల్బీనగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ ఆఫీసు ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాచేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో […]
సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్‌లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్డౌన్ సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్‌ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ […]
అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. రూ.ఐదులక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి వర్తింపు చేస్తామన్నారు. గురువారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆస్పత్రులకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తామన్నారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. వైద్యం ఖర్చు […]
సారథి న్యూస్, అనంతపురం: వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుందని ప్రకటించారు. సోమవారం సీఎం తన క్యాంపు ఆఫీసులో ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్‌తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరాతీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ […]
సారథిన్యూస్, రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న రఘునాథ్ ఆరోగ్యశ్రీలో ఓ డెంటల్ హాస్పిటల్‌ను రెన్యువల్ చేసేందుకు రూ. 30, 000 డిమాండ్ చేశాడు. 25,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం రఘునాథ్.. లంచం తీకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.