సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు అంగన్ వాడీ కేంద్రంలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డం లక్ష్మి (55) అంగన్వాడి కేంద్రంలో ఆకస్మికంగా కిందపడి శుక్రవారం మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన లక్ష్మికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు […]
సామాజిక సారథి, వలిగొండ: గర్భిణీ స్త్రీలు నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు 180 ఐరన్ మాత్రలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సర్పంచ్ లు బొల్ల లలిత శ్రీనివాస్, చేగూరి భిక్షపతి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంతో పాటు టేకులసోమారం అంగన్ వాడీ కేంద్రాలలో బాలింతలకు పౌష్టికాహారం, పరిపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, అంగన్వాడీ టీచర్ లు బి. సోమేశ్వరి, కె దుర్గ, ఆశా వర్కర్ వసంత, […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని 9వ నంబర్ అంగన్వాడీ కేంద్రంతో పాటు తిరుమలాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పబ్లిక్ హెల్త్ నర్సు సంపూర్ణ మాట్లాడుతూ.. పుట్టినబిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ముర్రుపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులు, బాలింతలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్యారోగ్య […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కస్తూరి సూచించారు. శనివారం ఆమె వెదిర గ్రామ పరిధిలోని కొనరావుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వంచ పద్మ, వైద్య సిబ్బంది శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]