Breaking News

 అంగన్వాడీ టీచర్ మృతి

అంగన్ వాడీ టీచర్ మృతి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు అంగన్ వాడీ కేంద్రంలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డం లక్ష్మి (55) అంగన్వాడి కేంద్రంలో ఆకస్మికంగా కిందపడి శుక్రవారం మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన లక్ష్మికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.