Breaking News

TELANGANA

కల్లాలు నిర్మించుకోండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రైతులు తమ పంటపొలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్​ కోరారు. గురువారం ఆయన మండలంలోని జాంబికుంట, మూసాపేట తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన కల్లాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతుల కోసం కల్లాలను నిర్మించి ఇస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేశ్​ గౌడ్, ఎంపీడీవో రామ్ నారాయణ […]

Read More

పామాయిల్ సాగును ప్రోత్సహించాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాష్ట్రానికి కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నాయని.. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా త్వరలోనే వస్తాయని అందువల్ల ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు లాభపడతారని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పామాయిల్​ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు కూడా […]

Read More
తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని

తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని

ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని.. కలకలం రేపిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘటన సారథి న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీకి కూతవేటు దూరం.. గురువారం మధ్యాహ్నం.. రవీంద్రభారతికి సమీపంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని కేకలు వేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకుంటున్న క్రమంలోనే ‘జై తెలంగాణ.. జై కేసీఆర్​’ అంటూ నినాదాలు […]

Read More
తెలంగాణలో 2,534 కరోనా కేసులు

తెలంగాణలో 2,534 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో పెరిగిన కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం 2,534 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. తాజాగా, మహమ్మారి బారినపడి 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 32,106 ఉన్నాయి. ఐసోలేషన్​25,066 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 327 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ ​23, భద్రాద్రి కొత్తగూడెం 81, […]

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్​ఎస్​ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్​ఎస్​ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్​ జిల్లా నిజాంపేటలో టీఆర్​ఎస్​ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More
వీఆర్వోలకు ఏమీ కాదు: సీఎం కేసీఆర్​

వీఆర్వోలకు ఏమీ కాదు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు వీఏవోలు, వీఆర్వోలకు తీపిక‌బురు అందించారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లును తీసుకొస్తున్నామని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఏవోల‌ను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామ‌న్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ శాఖ‌ల్లో వీఆర్వోలను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. రెవెన్యూ సంస్కరణ వ‌ల్ల ఉద్యోగుల‌కు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని సీఎం స్పష్టంచేశారు. సంస్కరణల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రెవెన్యూ సమస్యల […]

Read More
కొత్త రెవెన్యూ బిల్లు.. కీలక అంశాలు ఇవే

కొత్త రెవెన్యూ చట్టం.. కీలక అంశాలు ఇవే

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు బుధవారం ప్రవేశపెట్టారు. వీటిలో ‘భూమి హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం- 2020’, ‘గ్రామరెవెన్యూ అధికారుల రద్దు చట్టం- 2020’ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. ‘భూ లావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ […]

Read More
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రులు

సీఎం కేసీఆర్ ను ​కలిసిన మంత్రులు

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రులుగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తమ సేవలు అందించి ప్రజల అభిమానం చూరగొనాలని సీఎం ఆకాంక్షించారు.

Read More