Breaking News

RAMAGUNDAM

రాఖీ.. ఏదీ గిరాకీ

రాఖీ.. ఏదీ గిరాకీ

రాఖీ పౌర్ణమిపై కరోనా ప్రభావం వ్యాపారులకు ఈ ఏడాది తీవ్రనష్టం సారథి న్యూస్, రామగుండం: కరోనా మహమ్మారి రాఖీల దందాపై కూడా తీవ్రప్రభావం చూపుతోంది. రాఖీ పర్వదినానికి వారం రోజుల ముందు నుంచే ఉమ్మడి కరీంనగర్​ జిల్లా గోదావరిఖని మార్కెట్ లో సందడి ఉండేది. గతేడాది వరకు జోరుగా రాఖీల విక్రయాలు జరిగేవి. కానీ ఈసారి దుకాణాలన్నీ కళతప్పి వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మార్కెట్లకు ఎవరూ రావడం లేదు. ఒకవేళ వచ్చినా రాఖీలను కొనేందుకు ధైర్యం […]

Read More
పారిశుద్ధ్యం అధ్వానం

ఇంత నిర్లక్ష్యమా?

సారథి న్యూస్​, రామగుండం: పారిశుద్ధ్యం విషయంలో రామగుండం మున్సిపాలిటీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు శనిగల శ్రీనివాస్​, శనిగరపు చంద్రశేఖర్​ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనాతోపాటు ఇతర వ్యాధుల ముంపు పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం టెస్టులు చేయకపోవడంతో పేదలు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చేపడతామని పేర్కొన్నారు.

Read More
సింగరేణి జీఎంపై చర్యలు

రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలి

సారథి న్యూస్​, రామగుండం: ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగరేణి రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలని కార్మికసంఘాల నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుతో కార్మికులతో యాజమాన్యానికి సత్సంబంధాలు లేకుండా పోతాయని.. అంతిమంగా సింగరేణి యాజమాన్యానికి ఎంతో నష్టం చేకూరుతుందని చెప్పారు. కార్మికులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపాలని వారు పేర్కొన్నారు.

Read More
దళితనేతకు నివాళి

దళితనేత మైసన్నకు నివాళి

సారథి న్యూస్​, రామగుండం: అంబేద్కర్​ యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళితనేత దివంగత మైసన్న సేవలు మరువలేనివరి దళితసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్​లో మైసన్న వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళితసంఘాల నాయకులు పోగుల రంగయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య. దుబాసి బొందయ్య, శంకర్, రామునాయక్, సిద్ధార్థ, శనిగరపు రామస్వామి. లచ్చులు, గంటయ్య, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Read More
మానవత్వం.. అభినందనీయం

మానవత్వం.. అభినందనీయం

సారథి న్యూస్, రామగుండం: మూడు నెలల క్రితం ఆస్పత్రిలో వదిలేసిన పసిపాప ప్రాణాలను నిలిపి, అరోగ్యవంతురాలుగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆ చిన్నారిని ఐసీడీఎస్, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, […]

Read More

మొక్కలు నాటడం మనబాధ్యత

సారథిన్యూస్​, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్​డ్​ పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్​రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్​, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]

Read More

మద్యం దొంగలు అరెస్ట్​

సారథిన్యూస్​, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్​లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన శేఖర్​, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]

Read More

జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయం

సారథిన్యూస్​, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్​ చైర్మన్​ ఉదయ్​కుమార్​ పేర్కొన్నారు. జగ్జీవన్​ రామ్​ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్​రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్​రామ్​ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు […]

Read More