Breaking News

CARONA

ఇప్పుడేం చెప్పలేం..

సారథి న్యూస్, హైదరాబాద్ : విద్యాసంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. అదనపు ఆర్థికం భారం లేని బోధన పద్ధతులపై కసరత్తు జరుగుతోందని తెలిపింది. విద్యాసంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్‌ తరగతులపై మార్గదర్శకాలు జారీచేస్తామని […]

Read More
తమిళనాడు రాజ్​భవన్​లో 84 మందికి కరోనా

రాజ్​భవన్​లో 84 మంది కరోనా

చెన్నై: తమిళనాడు గవర్నర్​ అధికారిక నివాసం రాజ్​భవన్​లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్​భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్​ బన్వర్​లాల్​ పురోహిత్​ను కాంటాక్ట్​ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Read More

భోపాల్​లో సంపూర్ణ లాక్​డౌన్​

భోపాల్​: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్​ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Read More

45 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: భారత్​లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 45,720 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. కాగా ఒకే రోజులో 29,557మంది కోలుకున్నారు. కాగా ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. ఇప్పటివకరు 29,861 మంది ఈ వ్యాధితో మరణించారు. దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల […]

Read More

కరోనాపై అవగాహన

రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో బుధవారం ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​) ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి , ఉప సర్పంచ్ తుమ్మల రమేశ్​, వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More

ఇంత అమానుషమా

సారథిన్యూస్​, జోగుళాంబ గద్వాల: కరోనా విపత్తువేళ మనుషులల్లో మానవత్వం మంటగలుస్తున్నది. సన్నిహితులు, కుటుంబసభ్యులు, కన్నవాళ్లు, తోబుట్టువుల పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో ఓ వ్యక్తి (35) చనిపోగా.. కరోనాతో మరణించాడేమోనన్న అనుమానంతో అతడి మృతదేహాన్ని ప్రొక్లెయిన్​లో తీసుకెళ్లి ఖననం చేశారు కుటుంబసభ్యులు. చనిపోయిన వ్యక్తికి కరోన లేదని వైద్యులు నిర్ధారించినప్పటికి కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.

Read More
1,554 కేసులు.. 9 మరణాలు

1,554 కేసులు.. 9 మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా మొత్తంగా రాష్ట్రంలో 49,259కు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 37,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా 9 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 429 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ 842 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 132, మేడ్చల్​ 96, సంగారెడ్డి 24, ఖమ్మం 22, కామారెడ్డి 22, వరంగల్​ అర్బన్​ […]

Read More
కరోనా మరణాల్లో భారత్​కు 7వ స్థానం

కరోనా మరణాల్లో భారత్​కు 7వ స్థానం

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 648 మంది చనిపోయారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,92,915కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 28,732 మంది చనిపోయారని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో ప్రస్తుత లెక్కల ప్రకారం మరణాల్లో మన దేశం స్పెయిన్‌ని దాటేసింది. 7వ స్థానంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు 28,400 మరణాలతో 7వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ […]

Read More