Breaking News

CARONA

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 99,391 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 737కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 21,687 ఉన్నాయి. 24 గంటల్లో 26, 767 వైరస్​నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,48,078 శాంపిల్​టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా.. 473 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి

సారథి న్యూస్​, రామగుండం: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ నేతలు కనకరాజ్, యాకయ్య, నరేశ్​ డిమాండ్​ చేశారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామగుండం ప్రభుత్వాస్పత్రిని సీపీఐ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసవసతులు లేవని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు వైవీ రావు, మద్దెల దినేశ్​, తోకల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

Read More

కరోనా నియంత్రణలో విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గంలో తెగిన చెరువులు, చెక్ డ్యాంలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, వనేష్, హన్మిరెడ్డి, సుదర్శన్, […]

Read More
31వరకు లాక్​డౌన్​

పెద్దశంకరంపేటలో 31 వరకు లాక్​డౌన్​

సారథి మీడియా, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నారు. ఈ మేరకు గురువారం వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గురువారం పెద్ధశంకరంపేటలోని పద్మయ్య పంక్షన్​హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమయ్యారు. మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్​, తహసీల్దార్​, ఎస్సై, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షడు కుంట్ల రాములు, మండల పరిషత్​ ఉపాధ్యక్షడు […]

Read More
ఏపీలో 9,393 కరోనా కేసులు

ఏపీలో 9,393 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 9,393 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 3,25,396 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారినపడి 95 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,001గా నమోదైంది. 24 గంటల్లో 55,551 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా వైరస్‌ బారినుంచి 8,846 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారు 2,35,218 మంది ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 973, చిత్తూరు 836, ఈస్ట్​గోదావరి 1357, […]

Read More
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, కర్నూలు: కరోనాపై యుద్ధంలో ఫ్రంట్​లైన్​ వారియర్స్​గా ఉంటూ కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు ఎస్పీ డాక్టర్​ ఫక్కీరప్ప అన్నారు. కరోనా బారినపడి మృతిచెందిన పోలీస్​ హెడ్​కానిస్టేబుల్​ ఎస్​ఏ మాలిక్​బాషా కుటుంబసభ్యులకు 1993 బ్యాచ్​ పోలీసులు సేకరించిన రూ.లక్ష సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్​ త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More
కరోనాకు ఏకైక మందు ధైర్యమే

కరోనాకు ఏకైక మందు ధైర్యమే

సారథి న్యూస్​, హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని కోరారు. ‘అమెరికా లాంటి దేశం కరోనాతో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నాం. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నాడు. […]

Read More

70వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 69,652 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు 20,96,664 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,794 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటివరకు 53,866 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 6,86,395 మంది చికిత్స పొందుతున్నారు.

Read More