Breaking News

CARONA

బాధిత కుటుంబానికి బీమా​ అందజేత

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లా వెంకటాపురం సబ్ ఆఫీస్ పరిధిలోని గుమ్మడి దొడ్డి బ్రాంచ్ ఆఫీస్ లో పనిచేస్తున్న పాయం ప్రసాద్ ఇటీవల మృతిచెందాడు. సోమవారం వెంకటాపురంలో అతడి భార్య పాయం శకుంతలకు పోస్టల్ సిబ్బంది లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజనల్ సూపరింటెండెంట్​, భద్రాచలం నార్త్ అసిస్టెంట్ సూపర్ డెంట్ తదితరులు పాల్గొన్నారు.

Read More
ప్రకృతివనం పరిశీలన

ప్రకృతివనం పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం గ్రామ పాలకవర్గం పరిశీలించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల తో కలసి సోమవారం పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న, ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, రామడుగు మండల కో ఆప్షన్ రజబ్ అలీ వార్డు […]

Read More

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

సారథి న్యూస్​, గద్వాల​: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో సోమవారం చోటుచేసుకుంది. మల్దకల్ గ్రామానికి చెందిన నాగరాజు భార్య జాహ్నవికి నాలుగేండ్ల క్రితం మొదటి కాన్పులో మగపిల్లవాడు జన్మించాడు. రెండవ కాన్పు కోసం శనివారం కర్నూల్లోని బాలాజీ యశోద నర్సింగ్ హోంలో చేరగా.. ఆమెకు ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు జన్మించారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

Read More

కేసులు తగ్గుతున్నా.. వ్యాప్తి ఆగట్లే..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో […]

Read More

ఫేసులకు కాదు.. బండ్లకు పెడుతున్నారు మాస్కులు

హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నివారించడానికని తీసుకొచ్చిన మాస్కులను ముఖానికి ధరించాలని ప్రభుత్వాలు.. వైద్యులు చెబుతుంటే పలువురు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ‘అది మమ్మల్ని ఏమీ చేయదు.. కరోనా వస్తే మాకేంటి..?’ అనే రీతిలో నడుచుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే పలువురు ఆకతాయిలైతే.. నిఘా కెమెరాలను, పోలీసుల ఈ ఛాలన్ల నుంచి తప్పించుకోవడానికి కూడా మాస్కులనే వాడుతున్నారు. అదేంటి.. మాస్కులకు, ఈ ఛాలన్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే.. హెల్మెట్ లు పెట్టుకోకుంటే […]

Read More
ఆంధ్రప్రదేశ్ లో 6,242 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో 6,242 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహ్మమారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 6,242 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. మహమ్మారి బారినపడి 40 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 5,981 మంది మరణించారు. మొత్తం 72,811 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,400 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 6,58,875 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ […]

Read More
డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కూడా.. క్వారంటైన్ కి వెళ్లిన యూఎస్ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగలింది. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ […]

Read More

సీఎం జగన్​ మామ గంగిరెడ్డి మృతి

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్​రెడ్డి మామ, భారతిరెడ్డి తండ్రి ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్​లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగిరెడ్డి పులివెందులలో చాలా కాలం పాటు వైద్యుడిగా పనిచేశారు. దివంగత సీఎం రాజశేఖర్​రెడ్డికి ఆయన మంచి మిత్రుడు. ఆయన 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. పులివెందులలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం జగన్​ ఇవాళ పులివెందులకు వెళ్లనున్నట్టు సమాచారం.

Read More