సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా నిజాంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతబస్తీలో కొందరు బీజేపీ మద్దతుదారులను, హిందువులను ఇబ్బంది పెడుతున్నారని అటువంటి వారి చేతులు నరికేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను భారతీయ జనతాపార్టీ కాపాడుకుందని చెప్పారు. హైదరాబాద్ ఎవడబ్బ జాగీరు కాదు అంటూ మండిపడ్డారు. త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రజా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా(శనివారం) 2,511 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 877కు చేరింది. వైద్యాధికారులు 24 గంటల్లో 62,132 నమూనాలను పరీక్షించారు. మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,579 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,04,603కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు శుక్రవారం సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించేలా ముందుకు పోతున్నామని, దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ కే భవన్ లో అన్నిశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నిశాఖలు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం తయారు చేయాలని, శాసనమండలి, శాసనసభలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని, అసెంబ్లీ అధికారులతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) 2,817 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చేరిన కరోనా సంఖ్య 1,33,406కు చేరింది. తాజాగా వ్యాధిబారినపడి 10 మంది మృతిచెందారు. కరోనా మృతుల సంఖ్య 856కు చేరింది. వ్యాధి నుంచి తాజాగా 2,611 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,013 కు చేరింది. ప్రస్తుతం 32,537 యాక్టివ్‌కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్‌లో 25,293 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 452 కేసులు నమోదయ్యాయి. ఇలా జిల్లాల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ మహానగరంలో సుమారు 85వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ఇండ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. సుమారు రూ.9,700 కోట్ల వ్యయంతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దఎత్తున జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్బాలరాజు నాగరాజు లంచం కేసు అవినీతిలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేలా ఉంది. ఓ భూమికి పట్టా ఇచ్చే విషయంలో రూ.రెండు కోట్లకు డీల్ కుదుర్చుకుని, ఏకంగా రూ.1.1 కోట్లు లంచం తీసుకుని పట్టుబడిన విషయం తెలిసిందే. ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్ల లంచం స్వీకరిస్తూ పట్టుబడడం ఇదే తొలిసారి అని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండు స్వచ్ఛంద […]