Breaking News

సీఎం కేసీఆర్

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది

నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే […]

Read More
రామలింగారెడ్డి కుటుంబానికి సీఎం కేసీఆర్​ పరామర్శ

రామలింగారెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

సారథి న్యూస్, సిద్దిపేట: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read More
విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సీఎం కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​ పలు అంశాలపై చర్చించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.టీఎస్ బీపాస్ పాలసీకి […]

Read More
నియంత్రిత సాగు గొప్ప విప్లవానికి నాంది

నియంత్రిత సాగు గొప్ప విప్లవానికి నాంది

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను రాష్ట్ర కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగువిధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి నిదర్శనమని కేబినెట్ అభిప్రాయపడింది. బుధవారం సీఎం కేసీఆర్​అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు వనరులు.. వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన […]

Read More
కొత్త సెక్రటేరియట్​డిజైన్లు ఒకే

కొత్త సెక్రటేరియట్ ​డిజైన్లు ఓకే

తెలంగాణ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఐటీ కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు సీఎం కేసీఆర్ ​అధ్యక్షతన కేబినెట్ ​భేటీలో కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణ సంస్థలు ప్రతిపాదించిన డిజైన్లను ఆమోదించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం […]

Read More
5న తెలంగాణ కేబినెట్ మీటింగ్​

5న తెలంగాణ కేబినెట్ మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఆగస్టు 5న (బుధవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సెక్రటేరియట్ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
చుక్క నీటిని వదులుకునేది లేదు

చుక్క నీటిని వదులుకునేది లేదు

సారథి న్యూస్,​ హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి నదుల్లో మన హక్కు నీటివాటాను కాపాడుకుని తీరాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కేసీఆర్​ స్పష్టంచేశారు. ఎంతటి పోరాటానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శి యూపీ సింగ్ […]

Read More
హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఇప్పటికీ 87 పిల్స్ ను స్వీకరించిందని, నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోందని, ఈ క్లిష్టసమయంలో చేయాల్సిన పనులను వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోందని, దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. […]

Read More