సామాజిక సారథి, హైదరాబాద్: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. దీంతో ఇవి […]
టీఆర్‌ఎస్‌లో మళ్లీ సంస్థాగత సందడి పార్టీ పదవులు, ప్రభుత్వ నియామకాలపై ఆశ అధినేత కరుణ కోసం ఆశావహుల ఎదురుచూపు 2023 సాధారణ ఎన్నికల్లోగా దక్కించుకోవాలని పట్టుబడుతున్న నేతలు ఈనెల 15న ముగియనున్న ఎమ్మెల్సీ కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ముగియనున్న వేళ సంస్థాగత పదవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియ ఇప్పటికే పలు కారణాలతో వాయిదాపడిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్పార్టీలో శాసనమండలి సభ్యత్వాన్ని ఆశించి అవకాశం రానివారు అటు వైపు ఆశగా చూస్తున్నారు. పలు […]
సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్‌స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్‌కర్నూల్‌జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర […]
సారథి న్యూస్, రామడుగు: వినాయక చవితి అంటే.. డీజేలు, పూజలు, డప్పుచప్పుల్లు, భజనలతో మారుమోగిది. కానీ కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో పండగ సందడి పూర్తిగా తగ్గిపోయింది. చాలా చోట్ల వీధుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించనేలేదు. కొన్ని గ్రామాల్లో ప్రతిష్ఠించినా.. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రతి సారి 15 నుంచి 20 విగ్రహాలను ప్రతిష్టించేవారు. కానీ ఈ సారి మాత్రం నిశ్శబ్ధం అలుముకున్నది. ప్రజలు తమ ఇండ్లల్లోనే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు.