Breaking News

రోడ్డుప్రమాదం

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

స్కూలుకు వెళ్తూ.. తొలిరోజే విషాదం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్​నాయక్​ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్​నాయక్​ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 […]

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్​ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్​ చేసేందుకు రూ. […]

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నడియాడ్‌: ఎదురెదురుగా వస్తున్న రెండుకార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు. ఈ ఘటన గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాప‌క‌శాఖ సూప‌రింటెండెంట్ దీక్షిత్ ప‌టేల్‌ తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Read More