Breaking News

భారీవర్షాలు

భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

భారీ వర్షాలున్నయ్​.. జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సోమ, మంగళవారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమతంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈనెల 12,13 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కూడవెల్లి వాగు, మోయతుమ్మెద వాగు, పిల్లివాగు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నాని, […]

Read More
తెలంగాణలో కుండపోత వర్షాలు

తెలంగాణలో కుండపోత వాన

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు వరద పోటెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దయింది. కొన్నిప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని […]

Read More
దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో మూడురోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీవర్షానికి హైదరాబాద్​మహానగరం తడిసిముద్దయింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, ఎస్సార్‌ నగర్‌, అమీర్‌పేట, బేగంపేట, ఎంజే మార్కెట్‌, నాంపల్లి, ఆబిడ్స్‌, […]

Read More
వనపర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలి

సారథి న్యూస్​, వనపర్తి: ఇటీవల భారీవర్షాలకు జిల్లావ్యాప్తంగా వాగులు, చెరువులు, నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు వాగు అలుగు ఉప్పొంగి వరద నీరు శ్రీరామ టాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు వచ్చి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్​స్టేషన్ […]

Read More
భారీవర్షాలు.. నీట మునిగిన వనపర్తి

భారీవర్షం.. నీట మునిగిన వనపర్తి

పట్టణంలో భారీవర్షం.. లోతట్టు కాలనీలు జలమయం వరద నీటికి ఉప్పొంగిన తాళ్లచెరువు అక్రమ వెంచర్లు.. నిర్మాణాలే కారణం 20ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి.. సారథి న్యూస్, వనపర్తి: అక్రమ నిర్మాణాలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. భారీ వర్షాలకు వనపర్తి నీటమునిగింది. మంగళవారం రాత్రి కురిసిన వానలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాళ్లచెరువు వరద నీటితో పోటెత్తడంతో రామాటాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడలోని ఇళ్లలోకి నీళ్లు […]

Read More
వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా అధికారులను అలర్ట్ ​చేశారు. జిల్లాలో అధికారులు వారు పనిచేసే ప్రదేశాల్లోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో ప్రత్యేకంగా నంద్యాల, ఆత్మకూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, రాకపోకలు, విద్యుత్ కు అంతరాయం లేకుండా, ప్రాణ, పంటనష్టం […]

Read More
వరంగల్​లో మళ్లీ వర్షాలు

వరంగల్​లో మళ్లీ వర్షాలు

వరంగల్​: వరంగల్​ నగరాన్ని వర్షం వీడడం లేదు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి హన్మకొండలో భారీవర్షం కురిసింది. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. భారీవర్షాలతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముంపు ప్రాంతాల కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Read More
వాగులో ఒకరు గల్లంతు

వాగులో ఒకరి గల్లంతు

సారథి న్యూస్​, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]

Read More