సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు.. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు […]
అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు […]
సారథిన్యూస్, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం బీద, మధ్య తరగతి ప్రజలను దోచుకొని ధనికులకు పంచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలివెన శంకర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరిఖని పట్టణంలో ఓ కారుకు తాళ్లను కట్టి దాన్ని నెట్టుకుంటూ వెళ్లి వినూత్న రీతిలో సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ.. […]