సారథి న్యూస్, కర్నూలు: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జేసీ–2(అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ, ఎన్‌ఐసీ జిల్లా ఇన్‌చార్జ్ అరుణతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఏర్పాట్లకు సంబంధించి త్వరగా నివేదిక సమర్పించామన్నారు. జిల్లాలోని మంత్రాయం, కౌతాళం, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే […]
సారథిన్యూస్, గద్వాల: త్వరలో జరుగబోతున్న తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని.. పుష్కరఘాట్ల వద్ద మరమ్మతులు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అలంపూర్‌లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కేవలం అలంపూర్ ఒక్కచోటే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని.. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం పులికలు, వేణిసోంపురం, రాజోలి, తుమ్మిళ్ల, పుల్లూరు, అలంపూర్ వద్ద ఉన్న పుష్కరఘాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం బాగుచేయాలని కోరారు. […]
సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర నది పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక గెస్ట్‌హౌస్‌లో పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలపై నగరపాలక సంస్థ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయని, అప్పటిలోగా నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, రోడ్లు, […]
సారథి న్యూస్, అలంపూర్: నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి దిండిగల్ ఆనంద్ శర్మ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించేది ఒక […]
సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 12 ఏళ్ల ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే.. ఎంతో పుణ్యఫం భిస్తుందని పేర్కొన్న ఆయన.. నవంబర్‌లో జరిగే పుష్కరాలకు తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా ఉండేలా, మురుగు కలవకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఘాట్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఈ మేరకు […]