చెన్నై: కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్ స్టడీ సెంటర్ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేసి తలపై కుంకుమపువ్వు పొడిని చల్లారు. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని ద్రవిడర్ కజగం నేతలకు తెలపడంతో వారు ఆందోళనకు దిగారు. అనంతరం పోదనూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో మెడలోని చెప్పుల దండను తొలగించి.. కుంకుమను శుభ్రం చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు […]
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్ ఘోష్ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్‌వాక్‌కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి […]
సీపీఎం రాష్ట్ర నేత రాఘవులు సారథి న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడి మహిళను కాపాడాలని వచ్చిన భర్త, ఆమె బంధువులపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించి వారిపై హత్యాయత్నం, నిర్భయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు లంక రాఘవులు డిమాండ్ చేశారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు […]