వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]
సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]
సామాజిక సారథి, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్‌సీని రాష్ట్ర కోవిడ్ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎన్ని పాజిటివ్ వచ్చాయి తదితర వివరాల గురించి రాష్ట్ర బృందం ఆరా తీసింది. డాక్టర్ ప్రభావతి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పీహెచ్సీ రికార్డులను పరిశీలించింది. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది భూమయ్య, రామ్మోహన్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జార్ఖండ్: లిక్కర్ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి […]
సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.