ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్‌ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం.. మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ […]