Breaking News

కాంగ్రెస్

కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా తిరుపతి

కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా తిరుపతి

సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్​రామడుగు మండలాధ్యక్షుడిగా బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్​చార్జ్​మెడిపల్లి సత్యం ఉన్నారు.

Read More
పెట్రో ధరలు తగ్గించండి

పెట్రో ధరలు తగ్గించండి

సారథి న్యూస్, చొప్పదండి: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజల్,పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎన్టీఆర్​చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​రజితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​మేడిపల్లి సత్యం, పట్టణాధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ముద్దం తిరుపతి, గుర్రం రమేష్ పాల్గొన్నారు.

Read More
అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అహ్మద్‌ పటేట్‌ను మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం శనివారం ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. సందేశారా సోదరుల రూ.వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ప్రశ్నించనున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధుడైన తాను […]

Read More

అమరులకు నివాళి

సారథిన్యూస్, రామడుగు: భారత్​, చైనా సరిహద్దులో మృతిచెందిన అమరజవాన్లకు కాంగ్రెస్​ నాయకులు నివాళి అర్పించారు. శుక్రవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ‘అమరవీరులకు సలామ్​’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్​ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, బీసీ సెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్​, కాంగ్రెస్​ నాయకులు పంజల శ్రీనివాస్ గౌడ్, నీలం దేవకిషన్, బాపిరాజు, మన్నే సహృదయ్, మాణిక్యం, […]

Read More
చెవిలో పూలతో వినూత్న నిరసన

చెవిలో పూలతో వినూత్న నిరసన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం షానగర్ వరద కాల్వపై మోతె కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటికి పనులు ప్రారంభించకపోవడంతో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్​మేడిపల్లి సత్యం, ఆ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్నరీతిలో చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ఎంతో అట్టహాసంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసి ఇప్పటివరకు ఒక్క రూపాయి పని కూడా మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. […]

Read More

కాంగ్రెస్​ నేత వీహెచ్​కు కరోనా

హైదరాబాద్‌ : కాంగ్రెస్ సీనియర్​ నేత, మాజీ ఎంపీ వీహెచ్​ (హనుమతంతరావు)కు కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్​ ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే వందమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ రోజు నుంచే వీహెచ్​ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లాక్​డౌన్​లోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి సేవా […]

Read More

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం

సారథి న్యూస్​, ఎల్బీనగర్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కొత్తపేట డివిజన్ లో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జైపాల్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 78మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, హ్యాండ్ గ్లౌసులు, పండ్లు, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి డీసీసీ […]

Read More

ఘనంగా రాహుల్​ జన్మదినం

సారథిన్యూస్, బిజినేపల్లి: రాహుల్​గాంధీ కుటుంబానికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఎంపీటీసీ అంజి యాదవ్​ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో రాహుల్​ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి పలువురు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, ఉష అన్న , పాష , ఈశ్వర్, సూరి తదితరులు పాల్గొన్నారు.

Read More