కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసి: లోక్‌సభలో అరుదుగా మాట్లాడే కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యంత కీలకప్రశ్నను లేవనెత్తారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి సిలబస్‌తో పాటు పరీక్షలో వచ్చిన అంశాన్ని లేవనెత్తారు. దేశ మహిళలను కించపర్చే విధంగా ఈ ప్రశ్న ఉందని, సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు మితిమీరిన స్చేచ్ఛ వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని , మహిళలు సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పిల్లలు చెడిపోతున్నారని సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు పరీక్షలో క్వశ్చన్‌రావడంపై […]
రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని […]
హైదరాబాద్ : ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి రాహుల్ తప్పుకోవడంతో.. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరోగ్యసమస్యలు వేధించడం, తదితర కారణాలతో ఆమె పార్టీకి పూర్వవైభవం తీసుకురాలేకపోయారు. ఈ […]