హైదరాబాద్‌లో వరద బాధితులకు ప్రభుత్వం చేయూత, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు జిల్లాల కలెక్టర్లు, బృందాలు వెంటనే రంగంలోకి దిగాలి భరోసా కల్పించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం […]
సారథి న్యూస్, హైదరాబాద్: వరంగల్ లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే భద్రకాళీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల పోస్టర్ ను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రతిఏటా ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ ఈఓ సునీత, […]
సారథి న్యూస్, రామగుండం: ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయాలని హైకోర్టు న్యాయమూర్తికి సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పోస్టు ద్వారా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, జి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ తో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. పేదప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఆర్ఎస్ఎస్ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష […]
సారథి న్యూస్, చొప్పదండి: అక్రమ ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని, అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి స్టేజ్ వద్ద సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆగమేఘాల మీద మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. […]
సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై […]
వ్యవసాయ శాఖ.. ఇక డైనమిక్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఏం తింటున్నదో అవే పంటలు సాగుచేయించాలి వచ్చే ఏడాది నుంచి రైతులకు ‘అగ్రికల్చర్ కార్డులు’ వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీచేయండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్ట్మెంట్కాదని, […]