Breaking News

రైతుబంధు

కేసీఆర్​కు థ్యాంక్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: రైతుబంధు నిధులు విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్​కు.. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరికీ తక్షణమే రైతుబంధు నిధులు వారి అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకే తొలి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ఈ వానాకాలం సీజన్ కు ఇప్పటికే రూ.5,500 కోట్లు వ్యవసాయ శాఖకు బదిలీ చేశారని తెలిపారు. మరో రూ.1500 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్​ కరోనా విపత్తుల్లోనూ వ్యవసాయరంగానికి రూ. 7 వేల […]

Read More

వారం పదిరోజుల్లో రైతుబంధు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధమయ్యారని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఎకరా మిగలకుండా అందరికీ వారం పదిరోజుల్లో రైతుబంధు సొమ్మును బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆయన సమీక్షించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన వంటలను వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించిందని […]

Read More

రైతుబంధుపై స్పష్టత నివ్వాలి

సారథి న్యూస్​, హుస్నాబాద్ : రైతుబంధుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకుడు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలపై నియంత్రణ విధించడంతో రైతుబంధు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో రైతులు తమ భూములకు అనుకూలంగా పలు రకాల పంటలు పండిస్తే ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం తీసుకురావడమే కాకుండా గతంలో […]

Read More

రైతులను ప్రోత్సహించడమే లక్ష్య్ం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథి న్యూస్​, జనగామ: నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సూచించారు. ఆదివారం జనగామలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను రాజులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి ఇచ్చి సాగును ప్రోత్సహిస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, తాటికొండ […]

Read More

జూన్​ 10 కల్లా రైతుబంధు పైసలు

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి న్యూస్, మెదక్: వానాకాలం పంట సీజన్​కు సంబంధించి జూన్​ 10వ తేదీ నాటికి రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. ఆదివారం మెదక్​ జిల్లా కేంద్రంలో రైతులకు నియంత్రిత సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతులకు రైతుబంధు కోసం రూ.ఏడువేల కోట్లు అవసరం ఉండగా, ఇప్పటికే రూ.3,500 కోట్లు వ్యవసాయశాఖకు ఇచ్చినట్టు వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు అవసరం […]

Read More

చెప్పిన పంటలు వేయమనడం సరికాదు

సారథి న్యూస్, రామడుగు: రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ కల్పించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుబంధును ఏ విధమైన షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలను వేయాలనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో నాయకులు జెట్టవేని అంజి బాబు, బోయిని వెంకటేశం, మ్యాడారం సత్యనారాయణ, గాలిపల్లి రాజు పాల్గొన్నారు.

Read More

రుణమాఫీ చేయండి

బీజేపీ నాయకుల డిమాండ్​ సారథి న్యూస్, హుస్నాబాద్: రైతుబంధు నిబంధనలు తొలగించి రూ.లక్ష పంట రుణమాఫీ చేయాలని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలని, లేనిపక్షంలో రైతుబంధు ఇవ్వబోమనడం సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నునావత్ మోహన్, రాజ్ కుమార్, కృష్ణ, సంపత్, వంశీ తదితరులు […]

Read More